SRD: పటాన్ చెరువు పట్టణంలోని మైత్రి క్రికెట్ మైదానంలో క్రీడాకారుల కేరింతల మధ్య రాష్ట్రస్థాయి వాలీబాల్, కబడ్డీల క్రీడాజ్యోతిని ప్రజ్వలన చేసి, ఆటల పోటీలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు పట్లోళ్ల హనుమంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ గిరి గోస్వామి, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.