NLG: పౌష్టికాహారం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి అన్నారు. చిట్యాల మండలం వెలిమినేడులో పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా గురువారం సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించారు. ప్రాజెక్టు అధికారులు లావణ్య, వెంకటమ్మ, సూపర్వైజర్లు నాగమణి, సునీత, శిరీష, యాదమ్మ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.