VSP: విశాఖ రుషికొండపై నిర్మించిన ఐకానిక్ భవనాలను రాష్ట్ర ప్రభుత్వం అమ్మేస్తే ఊరుకునేది లేదని జన జాగృతి సమితి హెచ్చరించింది. ఈ భవనాలు ప్రభుత్వ ఆస్తి అని పేర్కొంటూ.. వాటిని ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్ చేస్తూ సమితి ప్రతినిధులు విశాఖలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.