VSP: యువత ప్రత్యేక లక్ష్యంతో ముందుకు సాగాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు. లక్ష్యం లేకుంటే జీవితంలో ఏమీ సాధించలేరన్నారు. గురువారం కృష్ణా కాలేజీలో సెట్విస్, ఎన్.వై.కే. ఆధ్వర్యంలో జరిగిన యువజనోత్సవాల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువత నీతి, నిజాయితీతో మంచి పౌరులుగా ఉండాలని హితవు పలికారు.