KMM: ఖమ్మంలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి స్థల అప్పగింత చర్యలు వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, తెలంగాణ దేవాదాయ శాఖ స్థపతి ఎన్. వాళ్ళినాయగం, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డిలతో కలిసి సమీక్షించారు. అల్లీపురం వద్ద 20 ఎకరాల స్థలం గుర్తించి, ఆలయ నిర్మాణానికి కేటాయించినట్లు తెలిపారు.