WNP: తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ క్షేత్రమైన కురుమూర్తి స్వామి జాతర అక్టోబర్ 22 నుంచి నవంబర్ 7 వరకు జరిగనుంది. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు కేటాయించడం కోసం రీజినల్ మేనేజర్ వనపర్తి ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ స్పెషల్ బస్సులో ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని సంస్థ కల్పిస్తుందని తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల సదుపాయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.