MLG: మేడారం జాతర అభివృద్ధి పనులపై ప్రతిపక్ష పార్టీలు అక్కసు వెళ్ళగక్కుతున్నాయని ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోత్ రవిచందర్ మండిపడ్డారు. ఇవాళ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదికగా మేడారం జాతరలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.