ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకమని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని ప్రతి గ్రామంలో విద్యుద్ధీకరణ జరగిందని తెలిపారు. ఇళ్లతో పాటు పరిశ్రమలకు తగిన విద్యుత్ అందుతోందన్నారు. తద్వారా తలసరి విద్యుత్ వినియోగం 1400 యూనిట్లకు పెరిగిందని చెప్పారు. సహజ వాయువు పైప్ లైన్లతో 15 లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.