TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల పరంగా రిజర్వేషన్లు అంగీకరించమని BRS ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తేల్చిచెప్పారు. బీసీలకు చట్టపరంగా రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించకుంటే.. నామినేషన్లకు దూరంగా ఉంటారా? అని కాంగ్రెస్కు సవాల్ విసిరారు. రిజర్వేషన్లపై మోసగించాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.