MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని శనివారం న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జే. మాలావి తెలిపారు. ఎల్ఎల్ఎం కోర్సులో మొత్తం 20 సీట్లు అందుబాటులో ఉన్నాయని, శుక్రవారం 6 మంది విద్యార్థులు కళాశాలలో రిపోర్ట్ చేశారన్నారు. మిగతావారు ఈ నెల 23లోపు సంబంధిత పత్రాలతో రిపోర్ట్ చేయాలన్నారు.