ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవం.. సంస్కృతికి నిలయంగా ఉందని ప్రధాని మోదీ కొనియాడారు. ‘చంద్రబాబు, పవన్ సారథ్యంలో 16 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. ఢిల్లీ, అమరావతి వేగంగా అభివృద్ధి పథంలో సాగుతున్నాయి. 2047 నాటికి మన దేశం వికసిత్ భారత్‌గా మారుతుంది. పలు ప్రాజెక్టుల వల్ల ఏపీలో కనెక్టివిటీ బలోపేతం అవుతుంది’ అని అన్నారు.