MLG: వెంకటాపూర్(మం) పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయంలో గత 20 సంవత్సరాల నుంచి సైట్ గైడ్ కం వాచ్ అండ్ వార్డు పని చేస్తున్న విజయ్ కుమార్, వెంకటేష్‌లు రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేసారు. తెలంగాణలో వివిధ పర్యాటక ప్రదేశాల్లో కేవలం రూ. 3900 రూపాయలతో పనిచేస్తున్న గైడ్ల వేతనాలు పెంచాలని కోరగా మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు.