MDK: మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం పొడిచినపల్లి గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి ప్రతి గింజను కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా ధాన్యం పైసలు రైతుల ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు. రైతులు కూడా ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దన్నారు.