BDK: మణుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్లో చైతన్యం డ్రగ్స్‌పై యుద్ధంలో భాగంగా మణుగూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంను గురువారం డీఎస్పీ రవీందర్ రెడ్డి నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి తెలపాలన్నారు.