వికసిత్ భారత్ లక్ష్య సాధనకు మల్టీ మోడల్ ఇన్ఫ్రా ప్రాజెక్టుల అభివృద్ధి జరుగుతుందని ప్రధాని మోదీ తెలిపారు. సబ్బవరం-షీలానగర్ హైవేతో కనెక్టివిటీ మరింత మెరుగవుతుందన్నారు. 2047 నాటి వికసిత్ భారత్ సంకల్పానికి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యం మరింత శక్తినిస్తుందని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కారులో ఏపీ సామర్థ్యాన్ని మరింత పెంచుతామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.