ADB: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న మందులనే వాడుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం ఇచ్చోడ మండలంలోని మేడిగూడలో పోలీసుల ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేశారు. కల్తీ ఆహారాన్ని తినకుండా ఆరోగ్య పదార్థాలను స్వీకరించాలని పేర్కొన్నారు. కార్యకమంలో డీఎస్పీ కాజల్, డా.క్రాంతి, విద్యార్థులు, అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.