SRCL: ఇల్లంతకుంటలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వినయ్ కుమార్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కుటుంబంపై రసమయి చేసిన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే బాలకిషన్ కవ్వంపల్లికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.