SKLM: జలుమూరు కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా ఎంఈవో 2 ఎం. వరప్రసాదరావు సందర్శించారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న ఆయన విద్యార్థుల హాజరు ఎలా ఉందో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. శతశాతం హాజరు ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తప్పనిసరిగా యూనిఫామ్ ధరించే విధంగా చూడాలని తెలిపారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించి పలు సూచనలు అందజేశారు.