గద్వాల జిల్లా అయిజ పట్టణంలో తక్షణమే మినీ ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. అయిజ బస్టాండ్ నుంచి రోజుకు 150కు పైగా బస్సుల రాకపోకలు సాగిస్తే, కోటి రూపాయలకు పైగా ఆదాయం వస్తుందన్నారు.