NLR: ఆత్మకూరు ఎమ్మెల్యే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈనెల 18వ తేదీన ఆత్మకూరు పట్టణంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్లో భాగంగా డంపు యార్డ్ పరిశీలన, జీఎస్టీ వెసులుబాటుపై స్థానికులకు అవగాహన ర్యాలీ కార్యక్రమం, తదితర కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.