BPT: విద్యార్థుల ఆధార్ నవీకరణకు ఈనెల 23 నుంచి అన్ని పాఠశాలల్లో ఆధార్ నవీకరణ ప్రారంభిస్తామని కలెక్టర్ వినోద్ కుమార్ ఇవాళ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 110 ఆధార్ నమోదు కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం 80 కేంద్రాలు పని చేయడంతో వాటి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.