BHNG: పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందడం కేవలం కాంగ్రెస్ పాలనతోనే సాధ్యమని ప్రభుత్వ విప్ ఆలేరు MLA బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి జిల్లా ఆత్మకూరు (యం) మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులలో పాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా పల్లెర్లలో మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను నేరుగా కలసి వారి ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.