KMM: అధిక పాల దిగుబడికి మేలు జాతి పశువులతోనే సాధ్యమని మధిర పశువైద్యాధికారి ఉమాకుమారి అన్నారు. గురువారం దెందుకూరు, సిద్ధినేనిగూడెంలో పశువైద్యాధికారి ఆధ్వర్యంలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా MPDO వెంకటేశ్వర్లుతో కలిసి ఇందిరా మహిళ డైరీ ద్వారా లబ్ధి పొందిన గేదెలను సందర్శించి లబ్ధిదారులకు సూచనలు చేశారు.