AP: శ్రీశైల క్షేత్రంలో ఇవాళ ప్రధాని మోదీ పర్యటించనున్నందున మ.2 గంటల వరకు శ్రీశైలంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆలయానికి వెళ్లే అన్ని దారుల్లో ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నారు. కాగా, శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న 5వ ప్రధానిగా మోదీ నిలువనున్నారు. గతంలో నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు ప్రధాని హోదాలో ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు.