భారతీయ బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలకు మరోసారి రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. IOB, CBI, BOI, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి బ్యాంకులు PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా, SBIలలో విలీనం కావచ్చని సమాచారం. ఈ అంశంపై సీనియర్ అధికారులు చర్చించి ఈ ప్రతిపాదనను PMO పరిశీలనకు పంపే అవకాశముందని ఓ ఉన్నతాధికారి చెప్పినట్లు ఆంగ్ల మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయి.