W.G: నరసాపురం టౌన్ 7వ వార్డులోని శ్రీపుంతలో ముసలమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బుధవారం జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గరగల నృత్యం, పులి డ్యాన్స్ కాళికామాత నృత్యాలు, బుట్ట బొమ్మలతో కూడిన అమ్మవారి ఉత్సవ ఊరేగింపును ఆయన ప్రారంభించారు.