SRCL: మహిళలు, గర్భిణీలు, బాలింతలు అన్ని రకాల పోషకాహారాలు తీసుకోవాలని సీడీపీవో ఉమారాణి అన్నారు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా తంగళ్ళపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారంపై గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీడీపీవో మాట్లాడుతూ.. మహిళలు, గర్భిణీలు, బాలింతలు కోడిగుడ్లు, పాలు, పప్పు దినుసులు లాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని ఆమె సూచించారు.