భారత్ అభివృద్ధికి ఏపీ ఎంత అవసరమో.. ఏపీకి రాయలసీమ అంతే అవసరమని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల ద్వారా రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాల కల్పన జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులతో రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని చెప్పారు. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లతో ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు.