WGL: నర్సంపేట(M) ఇటుకాలపల్లి గ్రామంలో దొంగతన ఘటన చోటుచేసుకుంది. SI అరుణ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఈనెల 15న అస్థికలు కలపడానికి భద్రాచలం వెళ్లారు. మళ్లీ తిరిగి ఇవాళ మధ్యాహ్నం ఇంటికి రాగ దొంగతనం జరిగినట్లు గుర్తించి 3 తులాల బంగారు ఆభరణాలు,10 తులాల వెండి దొంగిలించినట్లు వారు తెలిపారు. వెంటనే ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.