SRCL: జిల్లాలోని పత్తి రైతులకు కపాస్ కిసాన్‌పై అవగాహన కల్పిస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్టల్ బేగం తెలిపారు. పత్తి సాగు చేసే రైతులకు సీసీఐ అందించే మద్దతు పొందేందుకు కపాస్ కిసాన్ యాప్ సిద్ధం చేసిందని వెల్లడించారు. ఈ అప్లికేషన్లో రైతుల వివరాలు నమోదు చేసుకుంటేనే తమ పత్తి సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.