బాపట్ల మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇవాళ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మున్సిపల్ సిబ్బందికి CPRపై అవగాహన కల్పించారు. ఈ మేరకు కమిషనర్ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. హృదయ, శ్వాస సంబంధిత అత్యవసర సమయాల్లో CPR లాంటి ప్రాథమిక వైద్య చర్యలు ఎంతో కీలకమన్నారు. ప్రతి ఒక్కరూ దీనిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.