ప్రకాశం: ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో జరిగిన 8వ రాష్ట్రీయ పోషణ మాసం ముగింపు వేడుకల్లో గురువారం జిల్లా కలెక్టర్ రాజాబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా అంగన్వాడీలో అందిస్తున్న పోషకాహారాలను ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని కోరారు. తల్లులకు, ఐదేళ్లలోపు పిల్లలకు అవసరమైన పోషకాహారాన్ని సకాలంలో అందించాలని అధికారులకు కలెక్టర్ రాజాబాబు సూచించారు.