బాపట్ల జిల్లా నూతన అదనపు కలెక్టర్ వి.భావన ఇవాళ జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ బి.ఉమామహేశ్వర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఆయనకు పూలమొక్కను అందజేశారు. జిల్లా ప్రజల సంక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణలో సమన్వయం కల్పించడంలో కలెక్టరేట్, పోలీస్ విభాగాల మధ్య భాగస్వామ్యం కొనసాగిస్తామని ఎస్పీ చెప్పుకొచ్చారు.