SRD: ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న వారంతా ఈ కేవైసీ తప్పనిసరి చేయించాలని MPDO సత్తయ్య తెలిపారు. గురువారం కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో EKYC ప్రక్రియను ఆయన పరిశీలించి పర్యవేక్షించారు. మండలంలో మొత్తం 13,989 మంది జాబ్ కార్డు హోల్డర్లు ఉండగా, ఇప్పటికీ 7658 EKYC పూర్తయిందన్నారు. ఆధార్, జాబ్ కార్డుకు అనుసంధానం ఉంటేనే వేతన చెల్లింపులు సాఫీగా జరుగుతాయన్నారు.