SS: ముదిగుబ్బ మెయిన్ రోడ్డులో ఇరువైపులా చేపడుతున్న డ్రైనేజీ కాలువలను చివరి వరకు సరైన విధంగా నిర్మించాలని స్థానిక మహిళలు డిమాండ్ చేశారు. ఆంధ్రబ్యాంక్ వద్ద కల్వర్టులో డ్రైన్ నీరు వదిలివేయడంతో 200 కుటుంబాలు ఇబ్బందులు పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకు నుంచి రైల్వే మోరి వరకు పూడిక తీసి కాలువ నిర్మించకపోతే రోడ్డుపై ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.