రోజురోజుకూ పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే పసిడి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,440 గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,18,650గా నమోదైంది. మరోవైపు వెండి మాత్రం రూ.1000 తగ్గి రూ.2,06,000కు చేరుకుంది. కాగా, ధన త్రయోదశి ముందు బంగారం ధరలు స్థిరంగా ఉండటం గమనార్హం.