JDWL: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా తగ్గినట్లు ప్రాజెక్టు అధికారి ఖాజా జుబేర్ అహ్మద్ తెలిపారు. గురువారం ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు 30 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రాజెక్టులో 9.657 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాలుగు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా, కుడి, ఎడమ కాలువలకు సాగునీటిని యథావిధిగా విడుదల చేస్తున్నారు.