ELR: చాట్రాయి మండలం పర్వతాపురంలో వన సంరక్షణ సమితి సభ్యులు, గ్రామస్థులు గురువారం ఆందోళన చేపట్టారు. ఫేక్ అకౌంట్లు నమోదు చేసి సుమారు రూ.40 లక్షల నిధులను మార్చేశారని సర్పంచ్ శివాజీ ఆరోపించారు. గ్రామసభ జరపకుండా, సభ్యులకు తెలియకుండా నిధులు మళ్లించారని, ప్రజలకు నిధులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.