NLG: గతేడాదితో పోల్చుకుంటే మద్యం టెండర్లకు దరఖాస్తులు భారీగా తగ్గే అవకాశముంది. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానిస్తూ గత నెల 26న ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటివరకు కేవలం496 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంలో ఈ సంఖ్య 7,057గా ఉంది. దరఖాస్తు చేయడానికి రెండు రోజులే అవకాశం ఉంది. డిపాజిట్ ధర పెంచడం దరఖాస్తులు తగ్గడానికి కారణంగా తెలుస్తోంది.