ఆత్మనిర్భర్ భారత్ సాధనకు ఏపీ కీలకంగా మారనుందని ప్రధాని మోదీ వెల్లడించారు. దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఏపీకి ఉందన్నారు. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏపీ సామర్థ్యాన్ని విస్మరించాయని ఆరోపించారు. తద్వారా సొంత అభివృద్ధి కోసం పోరాడే దుస్థితి ఆంధ్రప్రదేశ్‌కు తలెత్తిందని చెప్పారు. కానీ NDA హయాంలో ఏపీ ముఖచిత్రమే మారుతోందని పేర్కొన్నారు.