ATP: నగరంలో ఈనెల 19న డ్యాన్స్, స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అశోక్ నగర్లోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి నృత్య క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శివప్రసాద్, ధనుంజయలు గురువారం తెలిపారు. భరతనాట్యం, కూచిపూడి, జానపద గిరిజన సంప్రదాయ నృత్యాలలో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గల వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.