GNTR: కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు వార్డ్ సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులను గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు సస్పెండ్ చేశారు. అనుమతి లేకుండా సమీక్షా సమావేశాలకు హాజరుకాకపోవడం, పట్టణ ప్రణాళిక విభాగ క్షేత్ర స్థాయి విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడంపై గురువారం సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు.