ASR: అరకులోయ మండలంలోని చొంపి గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. డ్రైనేజీ లేక ఆయా గృహాల్లో వాడే వ్యర్ధ నీరు సీసీ రోడ్డు పైనే పారుతూ,ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉండిపోతుందంటున్నారు. దీంతో దోమలు, ఈగలు పెరిగి మలేరియా, డెంగ్యూ, డయేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.