బంగారం ధర నిన్నటి పోలిస్తే భారీగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,330 పెరిగి రూ.1,32,770కి చేరుకుంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.3,050 పెరిగి రూ.1,21,700గా ఉంది. ఇదిలా ఉండగా రోజురోజుకూ పెరుగుతూ వస్తోన్న వెండి మాత్రం తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధర రూ.3000 తగ్గి రూ.2,03,000కి చేరింది.