MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని SBI బ్యాంక్ వెనకాల రూ. 20 లక్షల వ్యయంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణం కోసం అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి నేటి వరకు ఎలాంటి పనులు ప్రారంభించ లేదు. దీంతో ఆ ప్రాంతమంతా చెత్తా చెదారంతో నిండి డంపింగ్ యార్డును తలపిస్తుంది.