ATP: వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి 2,300 టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేస్తామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. చిన్మయనగర్ సమీపంలోని టిడ్కో ఇళ్లను మున్సిపల్, టిడ్కో, హౌసింగ్ అధికారులతో కలిసి ఇవాళ పరిశీలించారు. గతంలో చెప్పిన పనుల ప్రగతిపై సమాధానం కోరగా.. సరైన సమాచారం ఇవ్వకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.