కృష్ణా: ఢిల్లీలో ఫైనాన్స్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి శుక్రవారం మాట్లాడారు. కేంద్ర ఆర్థిక విధానాలు, గ్రామీణ అభివృద్ధి, రాష్ట్రానికి లభించే కేంద్ర నిధుల వినియోగం వంటి అంశాలను చర్చించారు. రైతులు, మత్స్యకారులు, చిన్న వ్యాపారుల సమస్యలను ముఖ్యంగా వివరించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అదనంగా నిధులు కేటాయించాలని కోరారు.