BPT: జిల్లాలో ప్రతి ఇంటికి తాగునీరు అందించే లక్ష్యంగా జల జీవన్ మిషన్ (JJM) పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ డా. వి.వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బాపట్లలో జరిగిన గ్రామీణ నీటి సరఫరా కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో 1.48 లక్షల ఇళ్లకు మాత్రమే కుళాయి కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. మిగిలినవి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.