AP: NTR జిల్లా ఇబ్రహీంపట్నంలో జనార్దనరావు విక్రయించినది కల్తీ మద్యమే అని కాకినాడ ల్యాబ్ రిపోర్ట్ తేల్చింది. మొత్తం 45 శాంపిల్స్‌పై టెస్టులు చేసిన ల్యాబ్.. ఇది ప్రమాదకరమైనది కాకపోయినా ప్రమాణాలకు తగ్గట్లుగా లేదని తెలిపింది. తుది నివేదిక ఆధారంగా A1 జనార్ధన్ రావుపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా ఈ కేసులో ఇప్పటివరకు 10 మంది అరెస్ట్ అయ్యారు.