చెన్నైలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. నగరంలోని ఆయన నివాసంలో బాంబు పెట్టినట్టు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్ వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీలు చేశారు. అయితే, తనిఖీల్లో ఎలాంటి బాంబు లభించలేదని తెలిపారు. ఇది ఫేక్ కాల్ అని అధికారులు భావిస్తున్నారు.